పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టండి
ఒడిశా బీజేపీ శ్రేణులకు మోడీ దిశా నిర్దేశం
ఒడిశా – రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పూర్తిగా శ్రద్ద వహించాలని సూచించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మధ్యనే ఉండాలని స్పష్టం చేశారు.
ఒడిశాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నియోజకవర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభ్యున్నతి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. వీటిని కింది స్థాయి వరకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని దిశా నిర్దేశం చేశారు మోడీ.
పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మరో పదేళ్ల పాటు రాష్ట్రంలో బీజేపీ పవర్ లోనే ఉండాలని స్పష్టం చేశారు.