NEWSNATIONAL

సైన్యం నేత‌ల‌కు స‌లాం చేసేందుకు కాదు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన పీఎం న‌రేంద్ర మోడీ

న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి ప్ర‌తిప‌క్షాలను ఏకి పారేశారు. శుక్ర‌వారం కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళులు అర్పించారు. వారి త్యాగాల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ ప్ర‌సంగించారు. అగ్ని ప‌థ్ ఎందుక‌ని ప‌దే ప‌దే వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు తీవ్రంగా బ‌దులు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

సైన్యానికి సంబంధించి అగ్ని ప‌థ్ ను ఆలోచించి తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు. అది కీల‌క‌మైన సంస్క‌ర‌ణ అని పేర్కొన్నారు. మ‌న సైన్యాన్ని నిత్య నూత‌నంగా ఉంచాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని పేర్కొన్నారు.

భార‌త దేశంలో సైన్యం ఉన్న‌ది రాజ‌కీయ నాయ‌కుల‌కు సెల్యూట్ చేసేందుకు కాద‌ని స్పష్టం చేశారు. వారి కోసం క‌వాతులు చేసేందుకు కాద‌ని గుర్తు పెట్టు కోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి. త‌ప్పుదోవ ప‌ట్టించే యువ‌త సైనికుల‌ను ప‌ట్టించు కోద‌న్నారు.