మౌలిక సదుపాయాలపై ఫోకస్
బంగ్లా..ఇండియా సమన్వయం
న్యూఢిల్లీ – మౌలిక సదుపాయాల వినియోగంపై తాము ఎక్కువగా ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇండియా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పీఎంతో భేటీ అయ్యారు. ఆమెకు సాదర స్వాగతం పలికారు. మోడీ మూడోసారి పీఎంగా కొలువు తీరిన తర్వాత తొలి విదేశానికి చెందిన అధ్యక్షురాలు హాజరు కావడం.
ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య కీలక సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. ఢిల్లీకి వచ్చిన ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.
సంవత్సరంలో తామిద్దరం దాదాపు పది సార్లు కలుసుకున్నామని చెప్పారు, అయితే ఈ పర్యటన ప్రత్యేకమైనది ఎందుకంటే తమమ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మా మొదటి రాష్ట్ర అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు పీఎం.
)గత సంవత్సరంలో భారతదేశం, బంగ్లాదేశ్ మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, వాణిజ్యం , ఇంధనం వంటి రంగాలపై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , స్పేస్ వంటి రంగాలలో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నరేంద్ర మోడీ.