సమున్నత భారతం కాషాయం
పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
మైసూరు – కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పనై పోయిందని నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మంగళూరు నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా కన్నడ వాసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి.
అనంతరం మైసూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ జనంతో పోటెత్తింది. ఈ సందర్బంగా ఎన్డీయే ఆధ్వర్యంలోని నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చారు. ప్రధానమంత్రి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ మాయ మాటలు చెబుతోందన్నారు. పవర్ లోకి వచ్చినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాషాయం హవా కొనసాగుతోందని చెప్పారు. తమకు పార్టీకి కనీసం 400 కు తక్కువ కాకుండా సీట్లు వస్తాయని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ప్రజలు సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ రెండింటిని అందించే సత్తా ఎన్డీయే కూటమికి మాత్రమే ఉందన్నారు.