దక్షిణాదిన బీజేపీ క్లీన్ స్వీప్
ప్రధానమంత్రి మోదీ
కేరళ – దక్షిణాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేరళ రాష్ట్రంలోని అలత్తూరులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కేరళ వాసులు తమ పట్ల చూపిస్తున్న ఆదరణ అద్భుతంగా ఉందన్నారు ప్రధానమంత్రి. దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమదేనని పేర్కొన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమ తనను మరింత పని చేసేలా ప్రేరణ ఇస్తుందన్నారు. ఒక రకంగా తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు మోదీ.
ప్రతి ఒక్కరికీ ఉపాధి, నిరుద్యోగం లేకుండా చేయడం, వనరులను ఉపయోగించు కోవడంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి. తాము విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆయుధంగా మార బోతోందన్నారు.
పేదలను పేదరికం నుంచి , మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.