మరాఠాలో కమల వికాసం – మోడీ
బీజేపీ విజయం ఖాయమన్న ప్రధాని
మహారాష్ట్ర – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి మరాఠాలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు పీఎం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో షోలాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, శివసేన తో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. ఈసారి పవర్ లోకి వచ్చేది కమలమేనని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ.
భారత దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు. గతంలో ఇండియాను ఏలిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలను నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపితే ఎలా అని ప్రశ్నించారు.
ప్రపంచ మార్కెట్ లో భారత్ ముందంజలో కొనసాగుతోందని చెప్పారు మోడీ. ఆరు నూరైనా సరే ఈసారి ఎన్నికల్లో తామే గెలుస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.