స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏనుగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోడీ. దేశంలో ఏనుగులు వృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందు కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయనుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఏనుగుల సంరక్షణకు సంబంధించి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు నిబద్దతతో ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
మన దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయని తెలిపారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించారు దేశ ప్రధానమంత్రి.
గత కొన్నేళ్లుగా భారత దేశంలో ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషకరమని తెలిపారు మోడీ. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అంచనా ప్రకారం 30 వేలకు పైగా ఏనుగులు ఉన్నట్లు అంచనా.