బీజేపీ విజయం మోదీనే పీఎం
400 సీట్లకు పైగానే వస్తాయి
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ మరోసారి దేశంలో అధికారంలోకి రావడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తాను ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు.
వచ్చే 2047లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఆయన ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిని ఏకి పారేశారు. దేశ అభివృద్ది కేవలం బీజేపీ సంకీర్ణ సర్కార్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ టార్గెట్ 400 సీట్లకు పైగా రావాలని, అంతకంటే ఎక్కువగానే వస్తాయని అన్నారు.
ఇక భారత కూటమికి కనీసం 40 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి మోదీ. ఇదిలా ఉండగా బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి షా సైతం మోదీ హవా కొనసాగుతోందన్నారు.