NEWSNATIONAL

ఈసారి కూడా బీజేపీదే స‌ర్కార్

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి కూడా ముచ్చ‌ట‌గా మూడోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తిరిగి అధికారంలోకి రానుంద‌ని జోష్యం చెప్పారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోడీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి కంగ‌నా రనౌత్ త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు.

ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వానికి జ‌నం పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నార‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారంతా ముక్త కంఠంతో తాను ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు న‌రేంద్ర మోడీ.

దేశం అన్ని రంగాల‌లో ముందు వ‌రుస‌లో నిలిపేందుకు తాను శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు. ఇవాళ డిజిట‌ల్ టెక్నాల‌జీ రంగంలో టాప్ లో కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

ఆరు నూరైనా స‌రే త‌మ పార్టీకి 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు .