బీజేపీ విజయం ఖాయం – మోదీ
మరోసారి నేనే ప్రధాన మంత్రిని
మరాఠా – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి తనే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గతంలో కంటే ఈసారి బీజేపీ సంకీర్ణ కూటమికి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని , ఇది భారత దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మార బోతోందని పేర్కొన్నారు ప్రధాని.
గతంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం సర్వ నాశనం అయ్యిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, రోడ్ షోకు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. రోడ్లకు ఇరు వైపులా సాదర స్వాగతం పలికారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.
ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షాలతో కూడిన భారతీయ కూటమిపై భగ్గుమన్నారు. వారికి అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి 30 సీట్లు కూడా రావన్నారు.