దేశమంతటా బీజేపీ హవా
400 సీట్లు మావేనంటున్న మోదీ
ఒడిశా – పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దూకుడు పెంచారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రపంచంలోనే పేరు పొందిన జగన్నాథుడు కొలువు తీరిన పూరీ నగరంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో దుమ్ము రేపింది. ఊహించని రీతిలో భారీ ఆదరణ లభించింది.
ఈ సందర్బంగా నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ మంతటా బీజేపీ హవా కొనసాగుతోందన్నారు. తమకు 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా తమను గెలిపిస్తారని అనడంలో సందేహం లేదన్నారు ప్రధానమంత్రి.
ప్రపంచం లోనే భారత దేశానికి ఊహించని రీతిలో ఆదరణ లభిస్తోందని చెప్పారు. చాలా దేశాలకు ఆదర్శ ప్రాయంగా ఉంటోందన్నారు. డిజిటలైజేషన్ లో ఇండియా నెంబర్ 1 గా ఉంటుందన్నారు ప్రధానమంత్రి.