పంజాబ్ లో బీజేపీ హవా
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
పంజాబ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంజాబ్ లోని పాటియాలాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు ఆదరణ లభిస్తోందని అన్నారు.
డిజిటలైజేషన్ రంగంలో ఇండియాను ఢీకొనే శక్తి ఇతర దేశాలకు లేదన్నారు. ప్రతిపక్షాలు స్కామ్ లకు పెట్టింది పేరన్నారు. వారి చరిత్రంతా మోసాలు, అబద్దాలతో కూడుకుని ఉంటుందని మండిపడ్డారు నరేంద్ర మోదీ. తమకు కనీసం 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి.