నా జీవితం ప్రజా సేవకు అంకితం
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి మోడీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తనను ఆడి పోసుకుంటున్నాయని కానీ తాను అలాంటి వాడిని కానని అన్నారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన తాను ఎన్నో అష్ట కష్టాలు పడ్డానని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ మీడియాతో సంభాషించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం మొత్తం ప్రజల కోసం పని చేస్తూ వచ్చానని స్పష్టం చేశారు మోడీ.
రాజకీయాలు గత 20 ఏళ్ల కిందటి లాగా లేవని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు అంతగా అనుకూలంగా లేని మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు ప్రధానమంత్రి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, దేశాన్ని అభివృద్ది బాటలో పయనించేలా చేసేందుకు తాను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో తమకు కనీసం 400 సీట్ల కంటే ఎక్కువగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మోడీ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.