NEWSNATIONAL

బీజేపీకి 400 సీట్లు ఖాయం

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ముచ్చ‌ట‌గా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీని , భార‌తీయ కూట‌మిని ఏకి పారేస్తున్నారు.

ఆరు నూరైనా ఈసారి వ‌చ్చేది బీజేపీ సంకీర్ణ స‌ర్కారేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు న‌రేంద్ర మోదీ. ప్ర‌పంచంలోనే ఆర్థిక రంగంలో టాప్ లో దూసుకు పోతోంద‌ని పేర్కొన్నారు. ఇదంతా త‌న వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు. దేశంలో సుస్థిర‌మైన పాల‌న‌తో పాటు స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌క‌త్వాన్ని క‌లిగి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ త‌ప్ప ఇంకేదీ లేద‌న్నారు న‌రేంద్ర మోదీ.

కాంగ్రెస్ మేనిఫెస్టో బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు. ఆ పార్టీకి ప‌ట్టుమ‌ని ప‌ది సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు ప్ర‌ధాన‌మంత్రి. ఆయ‌న గాంధీ కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. వారి వ‌ల్ల‌నే దేశం వెన‌క్కి పోయింద‌న్నారు.