హ్యాట్రిక్ సాధించడం ఖాయం
బీజేపీతోనే దేశాభివృద్ది
ఉత్తర ప్రదేశ్ – ఈసారి ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీని సాధించడం ఖాయమని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ . ప్రముఖ జర్నలిస్ట్ రుబీనా తో జరిగిన సంభాషణలో అభిప్రాయాలు పంచుకున్నారు. 543 సీట్లకు గాను తమకు 400 సీట్లకు పైగానే వస్తాయని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి ఈసారి కూడా షాక్ తప్పదన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావంటూ సెటైర్ వేశారు. తాను నిరంతరం దేశం కోసం, అభివృద్ది కోసం ఆలోచిస్తుంటానని కానీ ప్రతిపక్షాలు కేవలం తనను విమర్శించేందుకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తాను రోజుకు 20 గంటలకు పైగా కష్ట పడతానని చెప్పారు. తనకు ఉండేందుకు ఇల్లు లేదని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే స్వంత కారు కూడా లేదని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా 143 కోట్ల భారతీయులకు ఏం ఇవ్వాలనే దానిపై ఫోకస్ పెడుతున్నానని చెప్పారు.
అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు. వచ్చే 2047లో జరిగే ఎన్నికలలో ఎలా గెలవాలనే దానిపై ప్లాన్స్ వేస్తున్నానని చెప్పారు నరేంద్ర మోదీ.