కన్నడ నాట కమలానిదే హవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కర్ణాటక – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోష్ పెంచారు. మరింత ఉత్సాహంతో ఆయన కదన రంగంలోకి దూకారు. ఒక రకంగా చెప్పాలంటే దూకుడు పెంచుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
షెడ్యూల్ వెలువడిన వెంటనే తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా గళం సభలో పాల్గోని ప్రసంగించారు.
అనంతరం తెలంగాణకు వెళ్లారు. అక్కడ జగిత్యాలలో జరిగిన సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై భగ్గుమన్నారు. అక్కడి నుండి నేరుగా కర్ణాటకకు చేరుకున్నారు. రాష్ట్రంలోని శివ మొగ్గకు చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు.