బీజేపీ క్లీన్ స్వీప్ పక్కా
ప్రధాని నరేంద్ర మోదీ
కేరళ – సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ లోని అట్టింగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఎల్డీఎఫ్, యుడీఎఫ్ ల దుష్పరిపాలన , అవినీతితో కేరళ ప్రజలు విసిగి పోయారని ఆరోపించారు. దీంతో వారు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. తాను 2024లో జరగబోయే ఈ ఎన్నికల గురించి తాను పట్టించు కోవడం లేదని అన్నారు మోదీ.
దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా కాషాయ పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం ఆశిస్తున్నారని ఈ రెండింటిని తమ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
ప్రస్తుతం యావత్ ప్రపంచం గంప గుత్తగా భారత్ వైపు చూస్తోందన్నారు. ఇవాళ అన్ని రంగాలలో ఇండియా దూసుకు పోతోందని ఇదంతా బీజేపీ వల్లనే జరిగిందని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీజీ.