నేనే పీఎం నేనే సుప్రీం – మోదీ
వచ్చే ఎన్నికలపై ఫోకస్
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని పలు జాతీయ, రాష్ట్ర స్థాయి ఛానళ్లతో సంభాషిస్తున్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తనకు దేశం పట్ల ఎంతటి నిబద్దతతో ఉన్నానే విషయం కూడా పంచుకుంటున్నారు.
కాగా ఇండియా కూటమికి మరోసారి పరాభవం తప్పదన్నారు. తాజాగా ఇండియా టీవీ న్యూస్ ఎడిటర్ మీనాక్షి జోషితో ఆయన ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్బంగా తాను ఈ ఏడాది 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు మోదీ.
రాబోయే 2047లో జరిగే పార్లమెంట్ ఎన్నికల గురించి ఫోకస్ పెట్టానని, ఇందు కోసం ప్లాన్స్ కూడా రెడీ చేశానని స్పష్టం చేశారు. తిరిగి తాను ప్రధానమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో తానే కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.