గెలుపు తథ్యం మాదే అధికారం
ప్రజల తీర్పు శిరోధార్యం
రాజస్థాన్ – భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో మరోసారి జెండా ఎగుర వేయ బోతోందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా లో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున జనం ఆదరించారు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున మోదీకి సాదర స్వాగతం పలికారు.
దేశంలో సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్నారు ప్రధానమంత్రి. తాము అభివృద్దిపై ఫోకస్ పెడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయంటూ ధ్వజమెత్తారు పీఎం.
ప్రజలు వారిని విశ్వసించడం మానేశారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు, విమర్శలు చేసినా చివరకు అంతిమ విజయం మాత్రం తమదేనని కుండ బద్దలు కొట్టారు ప్రధానమంత్రి. ఇక రాజస్థాన్ లో ఇప్పటికే ప్రజలు పూర్తిగా అభివృద్ది కావాలని కోరుకుంటున్నారని ఆ దిశగా తాము ఫోకస్ పెట్టామని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఇవాళ యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందన్నారు. తాను 2024 ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు. రాబోయే 2047 గురించి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు.