కన్నడ నాట బీజేపీదే గెలుపు పక్కా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా
కర్ణాటక – దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందని చెప్పారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రికి.
దీనిపై స్పందించారు నరేంద్ర మోదీ. తనను ఆదరించిన కన్నడ వాసులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇవాల్టి రోడ్ షోలో రికార్డు స్థాయిలో హాజరైనందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. మంగళూరులో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు మోదీ.
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని , సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన పాలనను ఆశిస్తున్నారని వీటిని అందించే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.