జార్ఖండ్ లో బీజేపీదే విజయం – మోడీ
ఈసారి అధికారంలోకి మేమే వస్తాం
జార్ఖండ్ – జార్ఖండ్ లో ఈసారి జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బొకారోలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కిలోమీటర్ల పొడవునా ఈ ర్యాలీ కొనసాగింది.
ఆరు నూరైనా సరే ఈసారి బీజేపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు మోడీ. దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు రెప రెప లాడుతున్నాయని చెప్పారు. సుస్థిరమైన పాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
ప్రతిపక్షాల పార్టీలు చెప్పే వాటిని నమ్మవద్దని, దేశంలో ఆయా పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఇంకెంతగా హామీలు గుప్పించినా వారిని నమ్మ వద్దని కోరారు మోడీ.
తాము మిగతా పార్టీలకంటే మెరుగైన పాలనను అందిస్తున్నందుకే కేంద్రంలో మూడోసారి పవర్ లోకి వచ్చామని చెప్పారు. జార్ఖండ్ లో గెలిపించాలని, అభివృద్దికి బాటలు వేయాలని కోరారు ప్రధానమంత్రి.