ఒడిశాలో బీజేపీదే సర్కార్ – మోదీ
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి
ఒడిశా – ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన ప్రకటన చేశారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు షాక్ తప్పదన్నారు. బీజేడీ, కాంగ్రెస్ పార్టీలకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మోదీ జాతీయ ఛానెల్స్ తో సంభాషించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 10న ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా ఒడిశాలో ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు, రోడ్ షోలతో పాటు భారీ ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 400 సీట్లకు పైగా వస్తాయని జోష్యం చెప్పారు.
ఒడిశాలో మొదటి దశ పోలింగ్ ముగిసిందని అంతటా తమ పార్టీకి ఆదరణ లభించిందని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు పీఎం.