బీఆర్ఎస్..కాంగ్రెస్ ఒక్కటే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
జహీరాబాద్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జహీరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ , రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక్కరేనంటూ మండిపడ్డారు. రెండు పార్టీలు లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయని స్పష్టం చేశారు.
తమ పార్టీ తెలంగాణ ప్రాంతపు అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు మోదీ. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. దేశాన్ని కాంగ్రెస్ నిలువునా దోచుకుందన్నారు. అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరంటూ ధ్వజమెత్తారు ప్రధానమంత్రి.
తాము వచ్చాక దేశం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుందని, ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ.