కుంభకోణాలకు అడ్డా కాంగ్రెస్
నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. దేశంలో కొన్నేళ్లుగా కొలువు తీరిన ఆ పార్టీ సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావన్నారు.
గత కాంగ్రెస్ కూటమి పాలనలో అంతులేని అవినీతి, కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్ పెట్టామన్నారు ప్రధాన మంత్రి. ప్రజలు ఛీ కొట్టారని, మరోసారి తమకు పట్టం కట్టాలని జనం డిసైడ్ అయ్యారని చెప్పారు.
బీజేపీ సంకీర్ణ సర్కార్ సమర్థవంతమైన పాలన అందజేస్తోందన్నారు. తాను వచ్చాక అవినీతికి ఆస్కారం లేకుండా చేశానని చెప్పారు. ఇవాళ దేశం గర్వించేలా చర్యలు చేపట్టామన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు నరేంద్ర మోదీ.
విపక్షంలో ఉన్న అవినీతి పరులు, దళారులు తమ ప్రభుత్వంపై నిందారోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రజలు పూర్తిగా తమకే పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మోదీ.