డీఎంకే చాప్టర్ క్లోజ్ – మోదీ
నిప్పులు చెరిగిన ప్రధాని
తమిళనాడు – రాష్ట్రంలో డీఎంకే చాప్టర్ క్లోజ్ కాక తప్పదన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగించిన డీఎంకే ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. వేలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఆయన పదే పదే డీఎంకే పార్టీని కుటుంబ పార్టీగా పేర్కొన్నారు.
కేవలం అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతానికి డీఎంకే కేరాఫ్ గా మారిందని ధ్వజమెత్తారు నరేంద్ర మోదీ. ఈసారి తమిళనాడు వాసులంతా తమ నిర్ణయాన్ని మార్చుకోక తప్పదన్నారు. వారంతా ఎన్డీయేను గెలిపించాలని కోరుకుంటున్నారని, ఈ విషయం ఇక్కడికి విచ్చేసిన అశేష జనవాహినిని చూస్తుంటే తనకు అర్థం అవుతోందన్నారు మోదీ.
తమిళనాటలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు. తమకు బాహుబలి లాంటి కె. అన్నామలై లాంటి వ్యక్తి ఉన్నాడని కొనియాడారు. వంశ పారంపర్య రాజకీయాలను ఎంత కాలం బరిస్తారంటూ ప్రశ్నించారు ప్రధానమంత్రి. ఇకనైనా తమిళులు మారాలని సూచించారు మోదీ.
నన్ను తరిమి వేయాలని స్టాలిన్ అనుకుంటున్నారని, కానీ తాను వీరిని దేశం నుంచి వెళ్లగొట్టాలని అనుకుంటున్నాననంటూ సంచలన కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి.