నేనే పీఎం నాదే దేశం – మోదీ
జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గెలుపును ఏ శక్తి అడ్డు కోలేదని అన్నారు. తాను పీఎం కావడం ఖాయమని, తమ పార్టీకి 400 సీట్లకు పైగా వస్తాయని అన్నారు. ఆయన జాతీయ మీడియాతో సంభాషించారు. ముచ్చటగా మూడోసారి తాను ప్రధానమంతిగా ఈ దేశానికి కాబోతున్నానని ఇందులో సందేహం లదేన్నారు మోడీ.
ఒక రకంగా తాను చరిత్ర సృష్టించ బోతున్నానని, ఇందు కోసం 143 కోట్ల మంది భారతీయులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలో రికార్డ్ నమోదు చేసిన మాజీ ,దివంగత ప్రధాని నెహ్రూ రికార్డును తాను అధిగమించ బోతున్నానని తెలిపారు మోడీ.
తాను మూడు సార్లు లేదా ఐదుసార్లు గెలుస్తాను. ఇందులో ఎందుకు ఎవరికి అభ్యంతరం ఉండాలని అని మోడీ ప్రశ్నించారు. నాకు యావత్ భారతమంతా మద్దతుగా నిలిచిందన్నారు. తనను ఇంకొకరితో పోల్చ కూడదని సెలవిచ్చారు. తాను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశం ఎలా అభివృద్ది చెందిందనే విషయంపై ఆలోచించాలన్నారు.