ఇండియాకు మస్క్ మద్దతుదారు
స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్లా చైర్మన్, ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనకు తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. జాతీయ మీడియా ఏఎన్ఐ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్మితా ప్రకాష్ తో ప్రధానమంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చారు .
ఎలోన్ మస్క్ దూరపు చూపు కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. తాను చాలాసార్లు సంభాషించడం జరిగిందన్నారు మోదీ. ఇదే సమయంలో మస్క్ భారత దేశానికి మంచి మద్దతుదారుగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ సందర్బంగా ఎలోన్ మస్క్ మీ అభిమాని అని చెప్పాడని పేర్కొనడంతో పై విధంగా ఈ కామెంట్స్ చేశారు మోదీ. ఎలోన్ మస్క్ మోడీకి సపోర్ట్ చేయడం అంటే ఇండియాకు సపోర్ట్ చేయడమేనని చెప్పారు నరేంద్ర మోదీ.
ఈ దేశానికి పెట్టుబడి అత్యంత అవసరం. దీనిపైనే తాను ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. మస్క్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు వస్తాయి. వాటి ద్వారా నిరుద్యోగులకు జాబ్స్ లభిస్తాయని భరోసా ఇచ్చారు.