నా ఫోకస్ దేశ భవిష్యత్తు పైనే
ప్రకటించిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఆయన జాతీయ మీడియాతో సంభాషించారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలను ఏకి పారేశారు. వారికి అభివృద్ది గురించి పట్టించు కోరంటూ మండిపడ్డారు. నిరాశ వాదంతో ఉన్న వారికి దేని గురించి చెప్పినా అర్థం చసుకోలేరని అన్నారు.
తమ ప్రభుత్వం ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తుందన్నారు. ఆర్థిక రంగ పరంగా కీలకమైన మార్పులు తీసుకు వచ్చామన్నారు. ఇవాళ డిజిటలైజేషన్ రంగంలో ఇండియా టాప్ లో కొనసాగుతోందని చెప్పారు నరేంద్ర మోడీ.
తాము తీసుకునే ఏ నిర్ణయమైనా లేదా ఏ చర్య కు ఉపక్రమించినా ముందు దేశం గురించి ఆలోచిస్తామని చెప్పారు. గతంలో దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా గాంధీ కుటుంబానికి దక్కుతుందని ఆరోపించారు.
వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన ఆలోచనలన్నీ దేశం గురించి, ప్రజల గురించి తప్ప ఇంకోటి ఉండదన్నారు ప్రధానమంత్రి.