దేశం కోసం దేవుడు పంపాడు – మోడీ
ప్రధానమంత్రి సంచలన ప్రకటన
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు. గుర్తింపు పొందారు. ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తను టాప్ లో కొనసాగుతున్నారు. ఇది పక్కన పెడితే తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చలు చోటు చేసుకున్నాయి.
మీడియా సంస్థలన్నీ గంప గుత్తగా మోడీ భజనలో మునిగి పోయాయి. పేరు పొందినవన్నీ బీజేపీకి 390 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పకనే చెప్పాయి. ఇదే విషయాన్ని ఎన్నికలకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కీలక సమావేశంలో స్పష్టం చేశారు కూడా.
ఈసారి ఎన్నికల్లో తమ టార్గెట్ ఒక్కటేనని, 400 సీట్లకు పైగా సాధించడం మాత్రమేనని ప్రకటించారు. ఇది పక్కన పెడితే ఆయన చెప్పినట్లుగానే సంస్థలన్నీ మోడీ జపం చేశాయి. ఆయన పాటే పాడాయి. తాజాగా ప్రధానమంత్రి స్పందించారు. తనను దేవుడు ఒక లక్ష్యం కోసం పంపాడని చెప్పారు.
తన మూడవ పదవీ కాలం రాబోయే 1000 సంవత్సరాలకు భారత్ ను నిర్వచించేలా చేస్తుందని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.