దేశ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట – మోడీ
నాలుగు ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి కట్టుబడి ఉందన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలలో నిర్మించిన నాలుగు ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు మోడీ.
అహ్మదాబాద్ లోని నైపర్ వైద్య పరికరాలను అభివృద్ది చేస్తోందన్నారు. హైదరాబాద్ లోని నైపర్ బల్క్ డ్రగ్ ఉత్పత్తిని పెంచే పనిలో పడిందన్నారు. గౌహతి లోని నైపర్ ఫైటో ఫార్మాస్యూటికల్స్ కు మార్గదర్శకం చేస్తుందని తెలిపారు ప్రధానమంత్రి. ఇక మొహాలీ లోని నైపర్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ డ్రగ్స్ ను ఆవిష్కరణకు తెర లేపిందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
అదనంగా, పౌరుల శ్రేయస్సును మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం తన 5 ఆరోగ్య విధానాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నివారణ ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టండి అని కోరారు. సకాలంలో నిర్దారణ చేయాలని, చౌకైన మందులు, చికిత్సలు అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన వైద్యం , ఆరోగ్య సంరక్షణలో సాంకేతికతను ఉపయోగించాలని కోరారు మోడీ.