దేశ భవిష్యత్తుకు నాదే గ్యారెంటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ – భారత దేశం సమున్నతంగా ఎదగాలంటే, అన్ని రంగాలలో పురోభివృద్ది సాధించాలంటే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీహార్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీహార్ రాష్ట్ర ప్రజలు జంగిల్ రాజ్ ను ఇంకా మరిచి పోలేక పోతున్నారని అన్నారు. కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు. ఇవాళ దేశంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందన్నారు. ఎక్కడ కూడా చిన్న మత కలహాలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఉన్న 143 కోట్ల భారతీయుల భవిష్యత్తుకు నాదే గ్యారెంటీ అన్నారు. ఇవాళ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరు భారత్ వైపు చూస్తున్నారని, ఇలా చేసిన ఘనత తనదేనని చెప్పారు నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు సాధించింది కొంత మాత్రమేనని ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు పీఎం.