ఘజియాబాద్ ను మరిచి పోలేను
ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు ఈరోజు అంటూ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ప్రజలను ఉత్తేజ పరిచేలా ప్రసంగిస్తున్నారు.
ఇదిలా ఉండగా యూపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఘజియాబాద్ లో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టింది. ఈ సందర్బంగా ఓ వైపు ఎండ వేడిమి ఉన్నా చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు వేలాది మంది రోడ్డుకు ఇరు వైపులా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
తాను ఒకనాడు ఎన్నో కష్టాలు పడ్డానని, తమను బతికించేందుకు తన తల్లి ఎంతగానో కష్ట పడిందని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు నరేంద్ర మోదీ. ఎందరో తల్లులు, సోదరీమణుల ఆదరాభిమానాలు ఉన్నంత కాలం తాను పాలన సాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు . ఈ 10 ఏళ్ల కాలంలో మహిళా సాధికారత కోసం ఎంతగానో ప్రయత్నం చేశానని చెప్పారు ప్రధానమంత్రి.
తన జీవితంలో ఎల్లప్పటికీ ఘజియాబాద్ అందించిన ఆదరణను గుర్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు.