నేను నియంతను కాను – మోదీ
ధ్రువ్ రాఠీకి పీఎం స్ట్రాంగ్ కౌంటర్
ఉత్తర ప్రదేశ్ – తనను పదే పదే కొందరు నియంతగా అభివర్ణిస్తున్నారని అలాంటి వ్యక్తిని కానని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఓ జాతీయ ఛానల్ తో ఆయన సంభాషించారు. ప్రధానంగా ధ్రువ్ రాఠీ ని పరోక్షంగా హెచ్చరించారు.
ఆనాటి పీఎం నెహ్రూ వాక్ స్వేచ్ఛను తగ్గించేందుకు రాజ్యాంగంలోని తొలి సవరణను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఆయన కూతురు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఎవరూ ఊహించని రీతిలో దేశంలో ఎమర్జెన్సీని తీసుకు వచ్చిందన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని అనుకుందని , కానీ చివరకు తనే కటకటాల పాలైందన్నారు.
ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును తిప్పికొట్టారని ఆరోపించారు. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని మార్చడం ద్వారా మహిళల హక్కును రద్దు చేశారని మండిపడ్డారు మోదీ.
మీడియా సమావేశంలో క్యాబినెట్ తీర్మానం కాపీని రాహుల్ గాంధీ చించి వేశారని ఇదెక్కడి ప్రజాస్వమ్యమని ప్రశ్నించారు. ఎవరు నియంతలో ఎవరు ప్రజాస్వామిక వాదులో తెలుసుకుంటే మంచిదన్నారు మోదీ.