నియంతను కాను దేశ భక్తుడిని
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తనను లక్ష్యంగా చేసుకుని భారత కూటమికి చెందిన నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన జాతీయ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
మిమ్మల్ని ప్రతిపక్షాలే కాదు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, బుద్ది జీవులు, సామాజిక వేత్తలు, కార్యకర్తలు , కవులు, కళాకారులు, రచయితలు సైతం నియంత అని అంటున్నారని దీనికి మీరేం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు.
దీనిపై కూల్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం. మొదటగా రాజ్యాంగాన్ని ఎవరు సవరించారు. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ పాటలను ఎవరు నిషేధించారో ఈ దేశానికి తెలియదా అని ప్రశ్నించారు.
గాంధీ కుటుంబానికి సంబంధించి విహార యాత్రలు, పుట్టిన రోజులు జరుపుకునేందుకు భారతీయ నౌకా దళానికి చెందిన నౌకలను ఉపయోగించ లేదా అని నిలదీశారు మోదీ. జైపూర్ రాణి గాయత్రీ దేవిని హింసించింది ఎవరో తెలియదా. ఎమర్జెన్సీ సమయంలో అఘాయిత్యాలకు ఎవరు పాల్పడ్డారో చెప్పాలన్నారు.