2047 వరకు నేనే ప్రధానిని
ప్రకటించిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమున్నత భారతమంతా తనే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆయన ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు.
143 కోట్ల మంది భారతీయులంంతా ముక్త కంఠంతో సమర్థవంతమైన నాయకత్వం తో పాటు సుస్థిరమైన సర్కార్ ను కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలన్నీ అబద్దాలు చెప్పడంలో టాప్ లో కొనసాగుతున్నాయని అన్నారు.
అభివృద్ది చెందిన భారత దేశాన్ని తయారు చేయాలన్నదే తన కల అని స్పష్టం చేశారు. అన్ని రంగాలలో ఇండియా టాప్ లో కొనసాగాలంటే తాను ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పారు మోడీ. సర్వ శక్తిమంతుడైన దేవుడు తనను ఈ భూమి మీదకు దేశం కోసం పని చేయాలని పంపించాడని తెలిపారు.
అయితే వచ్చే ఏడాదితో తనకు 75 ఏళ్లు నిండుతాయని అయితే తాను రిటైర్మెంట్ అవుతానని పదే పదే ప్రతిపక్షాలు ప్రకటిస్తున్నారని కానీ తాను వాటి గురించి ఆలోచించడం లేదన్నారు నరేంద్ర మోడీ.