బెంగాల్ అభివృద్ది బీజేపీతోనే సాధ్యం
స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ
పశ్చిమ బెంగాల్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్దే ఎజెండాగా తాము ముందుకు వెళుతున్నామని, ప్రజలు సుస్థిరమైన పాలనతో పాటు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారని ఈ రెండింటిని అందించే సత్తా ఏకైక పార్టీ ఈ దేశంలో ఒకే ఒక్కటి ఉందని అది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్బంగా భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకు వచ్చామని, ఇవాళ పేదరికం అన్నది లేనే లేదన్నారు.
ప్రపంచ ఆర్థిక రంగంలో కీలకమైన దశకు చేరుకునేలా ప్రయత్నం చేశానని చెప్పారు నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్ లో అసమర్థమైన పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇక్కడ బీజేపీని ఆదరిస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు ప్రధాన మంత్రి.
టీఎంసీకి కాలం చెల్లిందని, ఇక మమతా బెనర్జీ ఇంటికి వెళ్లడం తథ్యమని జోష్యం చెప్పారు నరేంద్ర మోదీ. బెంగాల్ అన్ని రంగాలలో ముందంజలో కొనసాగాలంటే బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.