జి 20 సక్సెస్ ఒలింపిక్స్ కు సిద్దం
ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జి20 సదస్సుకు నాయకత్వం వహించడంతో ఇండియాకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని పేరు వచ్చేలా చేసిందని చెప్పారు. జాతీయ మీడియా ఛానల్ తో మోడీ సంభాషించారు.
జి20 సదస్సు సక్సెస్ తో వచ్చే 2036లో జరిగే ఒలింపిక్స్ ను కూడా నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రకటించారు. ఇవాళ ఇండియాను ఢీకొనాలంటే ఇతర దేశాలు భయపడే స్థితికి వచ్చేలా చేశానని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 400 సీట్లకు పైగా వస్తాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని, తాము వచ్చాక అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేశానని స్పష్టం చేశారు మోడీ.