డిజిటల్ ఆవిష్కరణలలో భారత్ టాప్
స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోడీ
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారత దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, దీనికంతటికీ గత 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొన్నారు.
సోమవారం ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా డిజిటలైజన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉండేదన్నారు. దీనిని నివారించేందుకు గాను నోట్ల రద్దును తీసుకు వచ్చామన్నారు. మొదట తను తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు ప్రశంసిస్తున్నారని చెప్పారు మోడీ.
ఇవాళ డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువలు సహజీవనం చేయగలవని భారతదేశం నిరూపించిందని చెప్పారు. తాము ఆచరణలో చేసి చూపించామని అన్నారు ప్రధానమంత్రి. చేరిక, పారదర్శకత, సాధికారత కోసం సాంకేతికత ఒక సాధనం అని తాము ఆచరణాత్మకంగా చూపించామన్నారు.
క్లీన్ ఎనర్జీ అనేది ముఖ్యమని, మెరుగైన రేపటి కోసం మన నిబద్దత అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు ప్రధానమంత్రి. 21వ శతాబ్దానికి స్థిరత్వం, ప్రజల చురుకైన భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు మోడీ.