NEWSNATIONAL

భార‌త్ విదేశాంగ విధానం భేష్

Share it with your family & friends

ఆప్ కీ అదాల‌త్ లో ప్ర‌ధాని

న్యూఢిల్లీ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఢోకా లేద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ. ఆయ‌న ప్ర‌సిద్ద కార్య‌క్ర‌మం ఆప్ కీ అదాల‌త్ లో ర‌జ‌త్ శ‌ర్మ‌తో సంభాషించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను వ‌చ్చాక ప్ర‌పంచంతో సంబంధాలు మ‌రింత మెరుగు ప‌డేలా చేశాన‌ని చెప్పారు.

విచిత్రం ఏమిటంటే నిత్యం మ‌నతో యుద్దం చేసే పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం భార‌త దేశ విదేశాంగ విధానం గురించి ప్ర‌శంస‌లు కురిపించార‌ని , ప్ర‌త్యేకించి దేశ విదేశాంగ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ చేస్తున్న ప్ర‌య‌త్నం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు న‌రేంద్ర మోడీ.

పాల‌స్తీనా తో పాటు ఇజ్రాయెల్ ను సంద‌ర్శించాను. తాను ముందు నుంచీ అన్ని దేశాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండాల‌ని కోరుతూ వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేకంగా ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడులు చేయ‌డాన్ని కూడా తాను త‌ప్పు ప‌ట్టాన‌ని అన్నారు. తాను ఎవ‌రి ప‌క్షం కాద‌ని మాన‌వ‌త్వ‌మే త‌న మ‌త‌మ‌ని ప్ర‌క‌టించారు మోడీ.