NEWSTELANGANA

మంద‌కృష్ణ నా త‌మ్ముడు

Share it with your family & friends

ప్ర‌ధాని మోదీ కామెంట్

వ‌రంగ‌ల్ జిల్లా – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఓరుగ‌ల్లులో బీజేపీ ఆధ్వ‌ర్యంలో భారీ బహిరంగ స‌భ ఏర్పాటు చేశారు. అశేష జ‌నం పీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

అంత‌కు ముందు త‌న‌ను క‌లుసుకున్నారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) చీఫ్ మంద‌కృష్ణ మాదిగ‌. ల‌క్ష‌లాది మందికి ఆయ‌న ప్ర‌తినిధిగా ఉన్నారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ కావాల‌ని గ‌త కొన్నేళ్లుగా పోరాటం చేస్తూ వ‌స్తున్నారు.

ఏ పార్టీ కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని హామీ ఇవ్వ‌లేక పోయింది. కానీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గ‌తంలో జ‌రిగిన స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు. బీజేపీ త‌ప్ప‌కుండా ఇస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా మంద‌కృష్ణ మాదిగ‌ను క‌లుసు కోవ‌డం త‌న‌కు సంతోషాన్ని క‌లిగించింద‌ని స్ప‌ష్టం చేశారు మోదీ. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

ఎంఆర్పీఎస్ చీఫ్ ను త‌న స్వంత త‌మ్ముడు అంటూ కితాబు ఇచ్చారు. పీఎం చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.