ఇల్లు..కారు లేని పేదోడు పీఎం
రూ. 52,920 నగదు మాత్రమే
ఉత్తరప్రదేశ్ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ యూపీలోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పెద్ద ఎత్తున సంకీర్ణ సర్కార్ లో భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు.
విచిత్రం ఏమిటంటే దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి ఉండేందుకు ఇల్లు లేదని, ప్రయాణం చేసేందుకు కారు కూడా లేదని స్పష్టం చేశారు . ఆయన చేతిలో ప్రస్తుతం రూ. 52,920 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు.
ఇక బంగారానికి సంబంధించి నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు ప్రధానమంత్రి. అయితే మొత్తం ఆస్తుల విలువ మాత్రం రూ. 3.02 కోట్లు ఉన్నాయని ప్రకటించారు. వీటిలో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2.86 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ రూపేణా ఉందని తెలిపారు.