విభజించే చట్టాలకు స్థానం లేదు – పీఎం
జాతిని ఉద్ధేశించి ప్రసంగించిన మోడీ
న్యూఢిల్లీ – ఈ దేశంలో విభిజించే చట్టాలకు స్థానం లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆగస్టు 15న 78వ స్వాతంత్రం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్ర కోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసి తీరుతామన్నారు. దేశాన్ని విభజించే చట్టాలకు స్థానం లేదన్నారు పీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, హిందువులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు మోడీ. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు మాత్రమే ఉంటాయని చెప్పారు.
సుప్రీంకోర్టు కూడా యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయడంలో తప్పేమీ లేదని పేర్కొందని ఈ సందర్బంగా పీఎం గుర్తు చేశారు. అందుకే తాము ఎవరికీ తలవంచమని స్పష్టం చేశారు.
దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాలం సెక్యూలర్ సివిల్ కోడ్ ను కోరుతోందని అన్నారు నరేంద్ర మోడీ.