NEWSNATIONAL

జ‌న సందోహం బీజేపీకి ప‌ట్టం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన న‌రేంద్ర మోదీ

అస్సాం – ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భంజనం వీస్తోంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న అస్సాం రాష్ట్రంలోని బార్మ‌ర్ లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భారీ ర్యాలీకి పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. వారిని చూసి సంతోషానికి లోన‌య్యారు ప్ర‌ధాన‌మంత్రి.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మ‌హిళ‌లు ఆయ‌న‌కు జ్ఞాపిక‌ను అంద‌జేశారు. వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీరు చూపిస్తున్న ఆద‌రాభిమానాలు, ప్రేమ‌, అభిమానం, ఆప్యాయ‌త‌ను తాను ఎల్ల‌కాలం గుర్తు పెట్టుకుంటాన‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ఈ దేశంలోని 143 కోట్ల మంది ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ఈ రెండూ కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌ని వారంతా న‌మ్ముతున్నార‌ని, తాను ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా న‌మ‌స్సులు తెలియ చేసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచంలో భార‌త దేశాన్ని అమెరికాతో పోటీ ప‌డేలా చేయాల‌న్న‌దే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు. తాను 2024 గురించి ప‌ట్టించు కోవ‌డం లేదన్నారు. రాబోయే 2047 గురించి ఆలోచిస్తున్న‌ట్లు చెప్పారు.