కీలక అంశాలపై క్వాడ్ ఫోకస్ – మోడీ
దేశాధినేతలతో చర్చలు ఫలప్రదం
అమెరికా – యుఎస్ఏ వేదికగా జరిగిన క్వాడ్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన ముచ్చటగా మూడోసారి ఇండియాకు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడంతో మరింత చర్చకు దారితీసేలా మారారు.
పీఎంగా కొలువు తీరాక అత్యంత కీలకమైన క్వాడ్ సమ్మిట్ కు హాజరు కావడం. దీనిపై ఎక్కువగా దృష్టి సారించే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఇదే సమయంలో ఆయనకు మద్దతుగా కీలకంగా మారారు భారత దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్.
ఆయన అన్నీ తానై వ్యవహరించడం విశేషం. ఈ సందర్బంగా జరిగిన క్వాడ్ కీలక సమ్మిట్ లో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్బంగా తన అనుభవాలను పంచుకున్నారు ప్రధానమంత్రి స్వయంగా.
ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ. క్వాడ్ లీడర్‌లను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు పీఎం.
ఈ సందర్బంగా జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని సంతోషం వ్యక్తం చేశారు మోడీ. క్వాడ్ ప్రపంచ మేలు కోసం ఎలా పని చేస్తూనే ఉంటుందనే దానిపై దృష్టి సారించిందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, వాతావరణ మార్పు, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాలలో తాము కలిసి పని చేయాలని వాగ్దానం చేశామన్నారు నరేంద్ర మోడీ.