ఉగ్రవాదం..క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం
క్వాడ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి మోడీ
అమెరికా – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న పీఎం ఇండో పసిఫిక్ క్వాడ్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచాన్ని ప్రస్తుతం ఉగ్రవాదం, క్యాన్సర్ పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని దేశాలు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా ఆయా దేశాధినేతలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి. ఉచిత, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ క్వాడ్ దేశాల భాగస్వామ్య ప్రాధాన్యత , నిబద్ధత ముఖ్యమని పేర్కొన్నారు.
అంతకు ముందు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తో భేటీ అయ్యారు. భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధం మరింత బలపడే ఛాన్స్ ఉందని అన్నారు నరేంద్ర మోడీ. బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా కూడా హాజరయ్యారు.
ఈ కీలక సమయంలో క్వాడ్ సభ్యులు భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ముందుకు సాగడం మానవాళికి అందరికీ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రకటించారు. ఈ ప్రపంచానికి కావాల్సింది ఉగ్రవాదం కాదు శాంతి కావాలని పిలుపునిచ్చారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.