థాయిలాండ్ భారత్ కు విలువైన స్నేహితుడు
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
థాయిలాండ్ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం థాయిలాండ్ లోని లావో పీడీఆర్ లో ప్రధానమంత్రి పేటింగ్ టార్న్ షినవత్రాలను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.
నరేంద్ర మోడీ థాయిలాండ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. థాయిలాండ్ భారతదేశానికి అత్యంత విలువైన స్నేహితుడు అని స్పష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారం అందించాలని ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
భారత్, థాయిల్ లాండ్ దేశాలు గత కొన్నేళ్లుగా సత్ సంబంధాలు కలిగి ఉన్నాయని అన్నారు మోడీ.
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాయని చెప్పారు నరేంద్ర మోడీ. రక్షణ, షిప్పింగ్, డిజిటల్ ఆవిష్కరణలు , సాంకేతికత తదితర రంగాలలో మరింత సంబంధాలు కలిగి ఉండాలని ఓ నిర్ణయానికి వచ్చామన్నారు.