రాజ్యాంగ ప్రయాణం చిరస్మరణీయం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్
ఢిల్లీ – పీఎం నరేంద్ర మోడీ భారత దేశ ప్రజాస్వామ్య స్పూర్తిని కొనియాడారు. రాజ్యాంగ ప్రయాణం చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచానికి మన దేశం ఆదర్శ ప్రాయంగా కొనసాగుతోందన్నారు. ఇవాళ అన్ని రంగాలలో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆర్థిక రంగంలో ఇండియా అత్యంత బలమైన దేశంగా ఎదుగుతోందని అన్నారు.
శనివారం లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ప్రజాస్వామ్యం మన దేశంలో పరిఢవిల్లుతోందని చెప్పారు. భిన్న మతాలు, విభిన్నమైన కులాలు, ప్రాంతాలు, వర్గాలతో కలిసికట్టుగా జీవిస్తున్న ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారత దేశం మాత్రమేనని స్పష్టం చేశారు.
మహిళా సాధికారతకు స్పూర్తిగా నిలుస్తోంది మన దేశమన్నారు. కారణం ఏమిటంటే దేశపు ప్రథమ మహిళ ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ము కొలువై ఉండడం అన్నారు. తాము వచ్చాక మహిళల భాగస్వామ్యం అన్నింటా పెరుగుతోందన్నారు మోడీ. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత మన దేశానికే దక్కుతుందన్నారు పీఎం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని అన్నారు .