NEWSNATIONAL

సైనికుల త్యాగాలు వెల క‌ట్ట‌లేం

Share it with your family & friends

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ

న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం అమ‌ర్ దివస్ సంద‌ర్బంగా మోడీ అమ‌రులైన వీర జ‌వాన్ల‌కు నివాళులు అర్పించారు. ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగ‌ల‌మ‌ని అన్నారు. ఈ దేశం కోసం ఎంతో మంది త‌మ విలువైన ప్రాణాల‌ను కోల్పోయార‌ని, బ‌లిదానం చేశార‌ని గుర్తు చేశారు. వారి గురించి, వారి త్యాగం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

దేశ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ చెరిగిన అంశం ఏదైనా ఉందంటే అది కార్గిల్ యుద్ద‌మ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో మ‌నం జ‌వాన్ల‌ను కోల్పోయామ‌ని తెలిపారు. ఎంతో మంది వీర మ‌ర‌ణం పొందార‌ని కొనియాడారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.

దేశంలో ప్ర‌తి వ‌స్తువుకు వెల క‌ట్ట వ‌చ్చ‌ని, కానీ అమ‌రుల త్యాగాల‌కు వెల క‌ట్టలేమంటూ స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి. కార్గిల్‌ యుద్ధంతో సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పామ‌న్నారు. ఇది యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింద‌న్నారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్‌ చేస్తున్నాన‌ని అన్నారు. 1999లో కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కలిశానని మోడీ చెప్పారు. కార్గిల్‌ విజయం భారత సైనికుల పరాక్రమానికి నిదర్శనమ‌న్నారు.