వంగ భూమిలో బీజేపీ హవా
సీఎం దీదీపై పీఎం ఫైర్
పశ్చిమ బెంగాల్ – ఈ దేశంలో ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందని చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్బంగా మాల్టాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీకి ఊహించని రీతిలో గతంలో కంటే ఎక్కువగా జనం ఆదరిస్తున్నారని చెప్పారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కేవలం బీజేపీ మాత్రమే అందించ గలదని నమ్ముతున్నారని అన్నారు మోదీ.
ముచ్చటగా మూడోసారి దేశంలో బీజేపీ సంకీర్ణ సర్కార్ కొలువు తీర బోతోందని చెప్పారు. తాను మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీగా ఉన్నానని అన్నారు మోదీ. విపక్షాలతో కూడిన భారతీయ కూటమి నేతలు ఈ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని, కానీ తాను రాబోయే ఎన్నికల గురించి ప్లాన్ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీజీ.