DEVOTIONAL

నిజ‌మైన ప్ర‌పంచ సృష్టిక‌ర్త విశ్వ‌క‌ర్మ

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ

ఢిల్లీ – హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మ ఈ ప్రపంచానికి అసలైన సృష్టికర్త అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ. నాడు కృష్ణ భగవానుడు పరిపాలించిన ధ్వారకా నగరంతో పాటు, పాండవులకు ఇంద్రప్రస్థ రాజభవనం, దేవతలకు అనేక రత్నశోభిత నగరాలను ఆయనే నిర్మించాడని అన్నారు.

చతుర్ముఖుడైన విశ్వకర్మ ఒక చేతిలో నీటి బిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగి వుంటాడని తెలిపారు. ఆ ఘన శిల్పి విశ్వకర్మ జయంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.

దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టిన రోజును హిందువులు పండుగలా జరుపు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు పీఎం. ఇదిలా ఉండ‌గా టీడీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నేతలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి వేడుకలు నిర్వహించారు. విశ్వకర్మ దివ్య వడ్రంగి అని కొనియాడారు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్ లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని కూడా రుగ్వేదంలో పేర్కొన్నారు.

కావున భారత భూమి వేద, జ్ఞాన భూమి అని .. నేడు ఇంజనీర్లు, ఆర్క్ టెక్చర్లు నాటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకొని వేదాలను, గ్రంథాలను తర్కించి భారత సంస్కృతిని కాపాడేలా నిర్మాణాలను చేపట్టి.. భారతదేశ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, పి. అనురాధ, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ నేతలు మన్నవ సుబ్బారావు, ఏ.వి రమణ, ధారపనేని నరేంద్రబాబు, హాజీ హసన్ బాషా, హనుమంతరావు, శంకర్ నాయుడు, పీరయ్య, బొద్దులూరి వెంకటేశ్వరరావు, లక్కోజు సత్యనారాయణ, కళిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.